ప్రియా నీ చూపులో ఉన్నది ప్రేమామృతం నీ నవ్వులో దాగున్నది గానామృతం నీవు పలికే ప్రతి మాటా నాకు వేదామృతం నీ నడకలోని ప్రతి అడుగు ఓ నృత్యామృతం
అందుకే చెలీ నా ప్రేమలో ఇంత ఆవేదన దానిని సాధించేందుకే ప్రతీక్షణం నాలో ఈ తపన
నీవే నా సర్వస్వం అని నీవే నా ప్రాణం అని నీవే నా లోకం అని అనుక్షణం కలల్లో విహరించా కానీ నువ్వు నా సొంతం కాగలవా అని నాకు ఎప్పటికీ సందేహమే
నీవే లోకంగా ఎల్లకాలం నిన్ను ప్రేమించాలనివుంది నీవే నా జీవితానికి గమ్యంగా నిన్ను అభిమానించాలనివుంది నీవే నా ప్రేయసిగా ఎల్లప్పుడూ ఆరాదించాలనివుంది కానీ నీకంటూ ఇష్టం లేకుంటే నా ప్రేమను ఎలా చెప్పగలను