ప్రియా.... నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడే తుమ్మెదలు

WD
ప్రియా...

నాపై ప్రసరించిన నీ తొలిచూపుల కిరణాలు
నా హృదిలో ప్రేమ వీణను మీటాయి

నాపై విసిరిన నీ చిరునవ్వుల బాణాలు
నాలో మల్లెల విరివానలు కురిపించాయ్

ఒకానొక రోజున అంటీ అంటనట్లు తగిలిన నీ చేతి స్పర్శ
ఒక్కసారిగా నా మనస్సును మత్తెక్కించింది

ఒంటరిగా ఉన్న నీ మనసుకు తోడుకావాలన్నప్పుడు
ఒట్టు... అది కలయేమోనని భ్రమపడ్డా

అది కలకాదు నిజం అని నీ వెచ్చని స్పర్శ చెప్పింది
అది కల్లకాదు నిజమేనని నీ పెదవులు చెప్పాయ్

నిజంగా నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడే తుమ్మెదలు
నీతోటి స్నేహం అధరాల సాక్షిగా... మధురాతి మధురం

నీ రాక కోసం...
నీ పలుకు కోసం...
నీ పిలుపు కోసం...

ఎన్నాళ్లయినా... ఎన్నేళ్లయినా...

వెబ్దునియా పై చదవండి