మనసు తోటకు విచ్చేసిన నేస్తమా...!

FileWD














కనులు మూసినవేళ కలలో నీవే
కనులు తెరచినవేళ కనిపించేదీ నీవే

మరచిపోదామనుకున్నవేళ జ్ఞాపకంలోనూ నీవే
వద్దని వెళ్లిపోతుంటే నీడవై వెంటాడేదీ నీవే

చేరుదామని పరుగులెడుతున్నవేళ దూరమయ్యేదీ నీవే
అలసిపోయి నే నిలబడితే రారమ్మని పిలిచేదీ నీవే

నాలోని ప్రేమ భావనకు పునాది నీవే
ఆ ప్రేమే నన్ను దహించేస్తుంటే చూస్తూ నవ్వుకునేదీ నీవే

మూగబోయిన నాలోని భావానికి అక్షరరూపం నీవే
అల్లుకున్న అక్షరాలను కవితలుగా ఏర్చి కూర్చిందీ నీవే

నేనంటూ బ్రతికున్నానంటే దానికి కారణం నీవే
ఏనాడైనా నే మరణిస్తానన్నది నిజమైతే దానికీ కారణం నీవే...

వెబ్దునియా పై చదవండి