సాధారణంగా ప్రతి నెలా కృష్ణపక్షమి రోజున శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. ఇందులో బహుళశద్ద పక్షమిలో వచ్చే శివరాత్రి చాలా ప్రత్యేకమైనది. కేవలం ఆ ఒక్కరోజున శివుణ్ణి పూజిస్తే చాలు. ఆ సంవత్సరం మొత్తం శివుణ్ణి పూజించినంత ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆ ఒక్కరోజులో శివుణ్ణి పూజిస్తే మనం ఎన్నో జన్మల నుండి చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. అందుకే మన పెద్దలు జన్మకో శివరాత్రి అని అంటారు. అంటే మనం జన్మలో ఒకసారైనా శివుణ్ణి పూజిస్తే చాలు.
ఒక రోజు శివుణ్ణి పార్వతీదేవి శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసం వుండి రాత్రి నాలుగు జాములలోను మొదట పాలతోను, తరువాత పెరుగుతోనూ, తరువాత నీటితో ఆ తరువాత తేనెతో అభిషేకిస్తే తనకు ప్రీతి కలుగుతుందని చెప్తాడు. మరుసటి రోజు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదని పరమశివుడు భోదిస్తాడు. అంతటి విశిష్టమైన శివరాత్రి రోజున పరమశివుని పూజించే విధానం ఎలాగో తెలుసుకుందాం.
మహా శివరాత్రి రోజున ఉదయం 5 గంటలకు నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత శుచిగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టి పూజా మందిరాన్ని పూలతో అలంకరించాలి. తెలుపు రంగు బట్టలు ధరించి శివుడు,పార్వతీదేవితో కలిసి ఉన్న ఫొటోకి లేదా లింగాకార ప్రతిమకు గంధం రాసి బొట్టు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. ఆరోజు తప్పకుండా మారేడు దళాలు శివునికి సమర్పించాలి.
అలానే పసుపు రంగు పూలతో గాని తెలుపు రంగు పూలమాలతో శివుణ్ణి అలంకరించాలి. ఆ తరువాత అరటిపళ్ళు, జామకాయలు, తాంబూలం నైవేద్యంగా పెట్టి నిష్టతో పూజించాలి. పూజా సమయంలో శివ అష్టోత్తరం, శివపంచాక్షరి మంత్రమును పఠిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్దిస్తాయి. శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు శివస్తోత్రాలు పఠించి శివుని స్మరించడం వల్ల ముక్తిని పొందుతారని శాస్త్రం. వీడియో చూడండి...