శివరాత్రి రోజున శివపురాణం పఠించడం మంచిది. సర్వ శుభాలు చేకూరుతాయి. గరుడ పురాణం, అగ్ని పురాణం వంటి వివిధ గ్రంథాలలో శివరాత్రి మహిమ గురించి ప్రస్తావించబడింది.
శివరాత్రి రోజున సాయంత్రం సూర్యుని అస్తమయం నుంచి మరునాడు ఉదయం సూర్యుడు ఉదయించే వరకు శివ పూజ చేసేవారికి ఎలాంటి పాపాలు వుండవు.
ఒక సంవత్సరం శివరాత్రి వ్రతం ఉండటం అంటే వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఎన్నోసార్లు గంగలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.