శ్రీవారి బ్రహ్మోత్సవాలను పర్యవేక్షించనున్న ఇస్రో.. 1000 ఆలయాల నిర్మాణం

సెల్వి

బుధవారం, 17 సెప్టెంబరు 2025 (10:21 IST)
రాష్ట్రవ్యాప్తంగా 1000 దేవాలయాలను నిర్మించాలని టిటిడి బోర్డు ప్రణాళికలు ప్రకటించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఆరు దేవాలయాలు నిర్మించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో మతమార్పిడులను ఆపడం లేదా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ భారీ ఆలయ నిర్మాణ ప్రాజెక్టుకు శ్రీవాణి ట్రస్ట్ నుండి నిధులు వినియోగించబడతాయి. అలాగే శ్రీవారి  బ్రహ్మోత్సవ వేడుకలకు సంబంధించిన కీలక ఏర్పాట్లను తితిదే వెల్లడించింది.
 
ఈ బ్రహ్మోత్సవాలను తొలిసారిగా ఇస్రో పర్యవేక్షిస్తుంది. బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23న ప్రారంభమై సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయని టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 24న మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది.
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పది రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు నిలిపివేయబడతాయి.సెప్టెంబర్ 28న జరిగే గరుడసేవకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు