ముంబైలో 16 ఏళ్ల బాలికపై కన్నతండ్రి, తోడబుట్టిన అన్నయ్య రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించి బాధితురాలి తండ్రి, అన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే... తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని ఆ పదో తరగతి అమ్మాయి తన స్కూలు టీచరు, ప్రిన్సిపాల్‌కు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్కూలు యాజమాన్యం ఓ స్వచ్ఛంద సంస్థకు విషయాన్ని చెప్పారు. వారి సాయంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.