యువతిపై మరో యువతి అత్యాచారం.. దాన్ని బెల్టుకు చుట్టుకుని..?

మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:18 IST)
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఘోరం జరిగింది. ఢిల్లీలో ఓ యువతిపై మరో యువతి అత్యాచారానికి పాల్పడింది. ఢిల్లీకి చెందిన శివానీ అనే యువతి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం కోసం వెతికింది. ఉద్యోగం, వ్యాపారం కోసం కొందరిని కలిసిన శివానీని.. కిడ్నాప్ చేసిన ఆచూకీ తెలియని వ్యక్తులు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.


ఇందులో షాకయ్యే విషయం ఏమిటంటే.. కిడ్నాప్ చేసిన యువతిపై మరో యువతి లైంగిక దాడికి పాల్పడటమే. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు కేసును నమోదు చేసుకోలేదు.
 
ఎందుకంటే.. సుప్రీం కోర్టు లెస్బియన్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే ఇందుకు కారణం. చివరికి ఓ సామాజిక కార్యకర్త ఆ యువతికి మద్దతుగా నిలిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. యువతిని వేధింపులకు గురిచేసిన బృందం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి వద్ద పోలీసులు జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
బాధితురాలిపై కృతిమంగా తయారు చేసిన.. పురుషుని జననేంద్రియాన్ని బెల్టు ద్వారా బెల్టుకు చుట్టుకుని అత్యాచారానికి పాల్పడేదని తెలిసి షాకయ్యారు. బాధితురాలిని దిల్షాద్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లిన కిడ్నాపర్లలో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి 19 ఏళ్ల యువతితో పాటు.. రాహుల్, రోహిత్‌లను అరెస్ట్ చేశారు. నిందితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం తీహార్‌ జైలుకు పంపించనున్నారు. ఇప్పటికే రాహుల్, రోహిత్ తీహార్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు