దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. దీంతో వైద్య నిపుణులు పదేపదే హెచ్చరికలు చేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దుర్గామాత ఉత్సవాల్లో అమ్మవారికి బంగారంతో మాస్క్ తయారు చేసిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగర పరిధిలోని బాగుయాటీ ప్రాంతంలో తాజాగా వెలుగుచూసింది.
అమ్మవారికి గోల్డ్ మాస్కుతోపాటు చేతిలో థర్మల్ గన్, సిరంజి, ఆక్సీమీటర్, ఇతర వైద్య సామాగ్రి,శానిటైజర్లు పెట్టి ఆరోగ్యం ప్రాధాన్యాన్ని గురించి భక్తులకు వివరించి చెప్పేందుకు సమాయత్తమయ్యారు. బంగారం మాస్కుతో తయారు చేసిన దుర్గామాత విగ్రహాన్ని బంధుమహల్ క్లబ్‌లో టీఎంసీ ఎమ్మెల్యే, బెంగాల్ గాయని అదితి మున్షీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దయచేసి అది కాస్ట్‌లీ బంగారు మాస్క్ అని అనుకోవద్దు. దయచేసి గోల్డ్ మాస్కును హైఎండ్ యాక్సెసరీగా చూడొద్దు, అసలు ఆలోచన ఏంటంటే... బెంగాల్‌లో ప్రతి కూతురు బంగారు తల్లే. ప్రత తల్లిదండ్రులూ తమ అమ్మాయిలకు బంగారం కొనాలనుకుంటారు. ఇక్కడ అమ్మవారికి ఏదో అలంకారంలా ఈ మాస్క్ పెట్టలేదు.