జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోమారు భారీ విధ్వంసానికి ప్రయత్నించారు. ముఖ్యంగా, పుల్వామా దాడి తరహా ఘటనకు ముమ్మర ప్రయత్నం చేశారు. తమ ప్రయత్నంలో భాగంగా, 20 కిలోల భారీ పేలుడు పదార్థాలతో కూడిన లారీని భారత భూభాగంలోకి పంపించారు.
ఈ ఘటన వల్ల సమీపంలో ఉన్న కొన్ని ఇండ్లు దెబ్బతిన్నట్లు సమాచారం. సైన్యం, పోలీసులు, పారామిలిటరీ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా ఐఈడీ వాహనాన్ని పట్టుకున్నట్లు ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.
కాగా, గత 2019, ఫిబ్రవరిలో పుల్వామాలోనే సీఆర్‌పీఎఫ్ వాహనశ్రేణిని ఐఈడీలతో నిండిన వాహనం ఢీకొట్టిన ఘటనలో 40 మంది జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఇండోపాక్ మధ్య స్వల్ప యుద్ధ వాతావరణం నెలకొన్నది.