కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా 21వేల మందికి కరోనా

గురువారం, 22 ఏప్రియల్ 2021 (11:54 IST)
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా.. కూడా కరోనా వైరస్ సోకుతోంది. కోవిడ్ టీకా మొదటి డోసు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 21వేల మంది కరోనా బారినపడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రెండో డోసు తీసుకున్న తర్వాత సుమారు ఐదున్నర వేల మందికి కొవిడ్ సోకినట్లు తెలిపింది. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 21వేల మందికి కరోనా సోకినట్లు కేంద్రం వెల్లడించింది. 
 
రెండో డోసు తీసుకున్న తర్వాత సుమారు ఐదున్నర వేల మంది కొవిడ్ బారినపడినట్లు వెల్లడించింది. ఇప్పటివరకూ కోటీ పదిలక్షల మందికి కొవాగ్జిన్ టీకాలు అందించామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. 
 
మొదటి డోసు తీసుకున్న 93 లక్షల మందిలో 4వేల 208 మందికి కరోనా సోకినట్లు వివరించారు. కొవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్న 17 లక్షల 37 వేల 178 మందిలో 695 మందికి కరోనా సోకినట్లు వెల్లడించారు. మొత్తం సంఖ్యలో ఇది 0.04 శాతమని.. కొవాగ్జిన్ టీకా తీసుకున్న పదివేల మందిలో నలుగురికి కొవిడ్ సోకినట్లు వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు