గుజరాత్ రాష్ట్రంలోని గోద్రాలో జరిగిన మారణకాండకు నేటితో 21 యేళ్లు పూర్తికానున్నాయి. ఈ మారణహోమంలో 59 మంది సజీవదహనమయ్యారు. గత 2002లో జరిగిన మారణహోమంతో గుజరాత్ పేరు మార్మోగిపోయింది. అలాంటి ఘటన జరిగి నేటికి 21 యేళ్ళు పూర్తికానున్నాయి. అయితే, ఈ మారణకాండను దేశ ప్రజలు నేటికీ మార్చిపోలేకపోతున్నారు.
2002 ఫిబ్రవరి 27వ తేదీన ఈ విషాదకర ఘటన చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఫిబ్రవరి 27వ తేదీన రాత్రి గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు కొందరు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. దీంతో గుజరాత్ అంతటా అల్లర్లు చెలరేగాయి. గుజరాత్ ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని క్షణ క్షణం బిక్కుబిక్కుమంటూ గడిపారు.
హిందూ యాత్రికులు సబర్మతి రైలులో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న క్రమంలో గుజరాత్‌లోని పంచమహాల్ జిల్లాలోని గోద్రా స్టేషన్‌కు చేరుకుంది. కొద్దిసేపు ఆగిన తర్వాత రైలు బలులుదేరుతున్న క్రమంలో గుర్తుతెలియని దండుగులు చైన్ లాగి రైలును ఆపారు. ఆ తర్వాత రైలుపై రాళ్లదాడికి పాల్పడి, రైలు కోచ్‌కు నిప్పు పెట్టారు. ఎస్6 కోచ్‌లో మంటలు చెలరేగడంతో 59 మంది సజీవదహనమయ్యారు.
ఈ ఘటనలో 1500 మందికిపైగా కేసు నమోదైంది. గుజరాత్ అంతటా మత హింస చెలరేగింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి ఏబీ వాజ్‌పేయి శాంతియుతంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ సమంయలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. ఈ మారణహోమానికి నాటి సీఎంగా మోడీనే కారణమంటూ అనేక రకాలైన విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే.