తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రకలకలం రేపింది. అసలేమిటీ డ్రై ఐస్.. ఇది తింటే ఏం జరుగుతోంది? అనే విషయాలు నెటిజన్లు ఇంటర్‌నెట్‌లో వెతికేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రకారం.. డ్రై ఐస్ ప్రాణాంతక పదార్థం. ఒట్టి చేతులతో డ్రై ఐస్ తాకడం కూడా అత్యంత ప్రమాదకరం.
తగినంత వెంటిలేషన్‌లేని ప్రదేశాల్లో ఆక్సిజన్ స్థానభ్రంశం అయ్యేలా చేస్తుంది. ఇక డ్రై ఐస్‌ని తింటే ఏకంగా ప్రాణాలకే ముప్పు తలపెడుతుంది. నోరు, అన్నవాహిక, కడుపులోని కణజాలాన్ని స్తంభింపజేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.