మరుగుదొడ్డి గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృత్యువాత

సోమవారం, 13 మార్చి 2023 (16:23 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. మరుగుదొడ్డి గోడ కూలిపోవడంతో ఐదేళ్ల బాలుడు చనిపోయాడు. నాసిరకమైన మెటీరియల్స్‌తో ఈ గోడను నిర్మించడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లంఖీపుర్‌ ఖేరీ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని మగల్‌గంజ్ ప్రాంతంలోని చపర్తల గ్రామానికి చెందిన లల్తా ఇంటి బయట ప్రభుత్వ నిధులతో ఓ మరుగిుదొడ్డిని నిర్మించారు. 
 
గత 2016లో నిర్మించగా, ఇందుకోసం నాసికరకం నిర్మాణ సామాగ్రిని వినియోగించారు. పైగా, ఇది నిర్మాణం పూర్తయినప్పటి నిరుపయోగంగానే వుంది. ఈ క్రమంలో శనివారం ఐదేళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి టాయిలెట్ వద్ద ఆడుకుంటున్నాడు. ఆసమయంలో మరుగుదొడ్డి గోడ, సీలింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ శిథిలాలు పక్కనే ఆడుకుంటున్న వారిపై పడగా, అందులో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు