వయోబేధం లేకుండా మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారి కామాంధుడి చర్యకు బలైపోయింది. ఐదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన దుర్ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, అహ్మద్‌నగర్ జిల్లా కారేగావ్ గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు శనివారం సాయంత్రం ఆటవిడుపు కోసం బయటికి వెళ్లారు.
అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆ బాలిక ప్రైవేట్ భాగాల్లో అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించినట్లు తెలిసింది. దీంతో పాటు ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై అహ్మద్ నగర్ జిల్లా దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఇందుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చాయి.