ముంబైలో నివాసముంటున్న ఓ మహిళ ఓ రాత్రి తన తల్లిదండ్రులు, సోదరుడిని తీసుకుని బాలుడి ఇంటికి వచ్చింది. తనను సదరు బాలుడు వివాహం చేసుకున్నాడనీ, అతడి కారణంగా తనకు బిడ్డ పుట్టిందనీ, ఇక్కడే వుంటానంటూ ఇంటి ఎదురు కూర్చుంది. ఐతే వారు మొండికేయడంతో నానా హంగామా చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా మైనర్ బాలుడిని వలలో వేసుకుని అతడితో బిడ్డను కన్న ఆ యువతిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలు తరలించారు. ప్రస్తుతం ఆమె బిడ్డతో సహా జైలులో వుంది.