పాముకాటుకు మరణిస్తున్న భారతీయుల సంఖ్య 50వేలకు చేరింది..

సెల్వి

మంగళవారం, 30 జులై 2024 (10:43 IST)
భారతదేశంలో పాములు అధిక సంఖ్యలో నివసిస్తాయి. భారతదేశంలో ఏటా 30 లక్షల నుంచి 40 లక్షల మంది పాము కాటుతో బాధపడుతున్నారు. ఏడాదిలో పాము కాటుతో మరణిస్తున్న భారతీయుల సంఖ్య 50 వేలకు చేరిందని లోక్‌సభలో జరిగిన చర్చలో సరన్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. 
 
ప్రపంచంలోనే అత్యధికంగా పాముకాటు మరణాలు భారత్‌లోనే ఉన్నాయి. పేదరికం, జాతీయ విపత్తుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో బీహార్ మొదటి స్థానంలో ఉంది. పాముకాటు మరణాల సంఖ్య కూడా బీహార్‌లోనే ఎక్కువగా ఉంది.
 
పాముకాటు మరణాల సంఖ్యను తగ్గించవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా పాముకాటు ఘటనలు ఎక్కువయ్యాయి. దేశంలో 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పాముకాట్ల సంఘటనలు కూడా పెరుగుతాయని ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు