16 ఏళ్ల బాలికతో 58 ఏళ్ల వ్యక్తికి పెళ్లి.. చివరికి..?

మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:11 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోబోయిన 58 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కంప్లి జిల్లా, హంపాదేవినహళ్ళి పంచాయతీ పరిధిలోని జీరిగనూరు గ్రామానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తి, 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
 
ఏప్రిల్ 23న పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు 1098 కు ఫోన్ చేసి సమాచారం చెప్పటంతో హోసపేటె శిశు అభివృధ్ధి యోజన అధికారి, కంప్లి పోలీసులు తమ సిబ్బందితో వెళ్లి పెళ్లి రద్దు చేయించారు.
 
అయితే మర్నాడు పట్టణ సెరుగు గ్రామంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. సమాచారం తెలుసుకున్న తహసిల్దార్ గౌసియా బేగం వెళ్ళి వివాహాన్ని అడ్డుకుని 58 ఏళ్ల వ్యక్తిని కంప్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అతనిపై బాల్యవివాహ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు