సైబర్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేటుగాళ్ల వలలో సామాన్య ప్రజలే కాదు ఐఏఎస్ అధికారులూ పడుతున్నారు. తాజాగా రాజస్థాన్ ఉదయ్‌పుర్ జిల్లా ఐఏఎస్ అధికారికి చరవాణికి నకిలీ కెవైసీ లింక్ పంపి, బ్యాంక్ ఖాతా నుంచి 6.10 లక్షలను కాజేశాడు ఓ మోసగాడు.
నగదు బదిలీ కావటాన్ని గుర్తించిన ఆమె వెంటనే జాడోల్ పోలీస్ స్టేషన్, ఉదయ్‌పుర్ సైబర్ సెల్లో కేసు నమోదు చేశారు. కానీ ఆమె బ్యాంక్ ఖాతా బెంగళూరులో తెరిచినందున అధికారులు ఈ కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసి విచారణను వేగవంతం చేశారు.