దేశ ఆర్థిక రాజధాని ముంబై, చెంబూరులో విషాదకర ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏడుగురు సజీవదహనమయ్యారు. కిందనున్న ఎలక్ట్రిక్ షాపులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించడంతో అందులోని ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృత్తుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.