కిష్ట్వార్ జిల్లాలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

గురువారం, 17 నవంబరు 2022 (08:39 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కిష్ట్వార్ జిల్లాలో ఘోరం జరిగింది. ఒక టాటా సుమో కారు లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. కిష్ట్వార్‌ జిల్లాలోని మర్వా ప్రాంతం వద్ద జరిగింది. అతి వేగంగా వెళుతున్న ఈ కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడే చనిపోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను లోయలో నుంచి వెలికి తీశారు. టాటా సుమో కారు ప్రమాదానికి గురైన ప్రాంతం అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతం కావడం గమనార్హం. మృతుల్లో ఏడుగురు మర్వా ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు