రైలులో ప్రయాణిస్తున్న మహిళపై దోపిడీ దొంగల గ్యాంగ్ రేప్

శనివారం, 9 అక్టోబరు 2021 (14:46 IST)
లక్నో - ముంబైల మధ్య నడిచే పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ దారుణం జరిగింది. ఆ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై దోపిడీ దొంగలు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. 
 
స్లీప‌ర్ కోచ్‌లో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ‌పై 8 మంది దోపిడీ దొంగ‌లు క‌త్తుల‌తో బెదిరించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంత‌టితో ఆగ‌కుండా ఆ కోచ్‌లో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికుల నుంచి న‌గ‌దు, ఆభ‌ర‌ణాల‌ను అప‌హ‌రించారు. దొంగ‌ల దాడిలో ఐదారు మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.
 
దీంతో ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు గురై గ‌ట్టిగా అర‌వ‌డంతో రైలును ముంబైలోని కాస‌రా స్టేష‌న్ వ‌ద్ద ఆపేశారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఆ కోచ్ వ‌ద్ద‌కు చేరుకుని ఇద్ద‌రు దొంగ‌ల‌ను అరెస్టు చేశారు. 
 
ఆ త‌ర్వాత మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రో న‌లుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగ‌ల నుంచి రూ.34 వేల న‌గ‌దు, ఇత‌ర వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు