కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

గురువారం, 6 అక్టోబరు 2022 (10:08 IST)
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలక్కాడు జిల్లా వడక్కెంచేరిలో పర్యాటకుల బస్సు, కేరళ ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటనలో తొమ్మిది ప్రాణాలు కోల్పోగా... 16మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ప్రమాదం సమయంలో టూరిస్టు బస్సులో 41 మంది విద్యార్థులు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు ఉద్యోగులు వున్నారు. కేరళ ఆర్టీసీ బస్సులో 49మంది ప్రయాణీకులు వున్నారు. ఎర్నాకులంలోని ముళంతురితిలోని బేసిలియన్ స్కూల్ నుంచి  విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. 
 
ఓ కారును ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు ప్రమాదానికి గురై వాగులో బోల్తా పడింది. వలయార్ వడక్కంచేరి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులు టూరిస్టు బస్సులో విహారయాత్రకు వెళ్లారు. ఊటీకి వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా ప్రమాద తీవ్రత పెరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు