ఆత్మహత్యల్లో డ్రాగన్ కంట్రీని అధికమించిన భారత్

ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (10:14 IST)
మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఇతర కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య దేశంలో నానాటికీ పెరిగిపోతోంది. ఈ ఆత్మహత్యల్లో డ్రాగన్ కంట్రీని భారత్ అధికమించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య బీహార్ కంటే అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
ఏపీ కంటే తెలంగాణాలోనే అధికంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏపీలో 15.3 శాతం సూసైడ్ చేసుకుంటుండగా, తెలంగాణాలో ఈ సంఖ్య 26.9 శాతంగా ఉంది. అయితే, దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యా కేసుల్లో 33.2 శాతం బలవన్మరణాలకు కుటుంబ సమస్యలే ప్రధాన కారణమని జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) పేర్కొంది. ఈ విషయం హైదరాబాద్ నగరంలో జరిగిన 9వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆసియన్ సైకియాట్రి సదస్సులో పాల్గొన్న నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ప్రతి యేడాది దేశ వ్యాప్తంగా 1.63 లక్షల మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే, వాస్తవ సంఖ్య మాత్రం 1.90 లక్షలకు పైమాటగానే వుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కానీ గ్లోబర్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ మాత్రం ఈ సంఖ్య 2.30 లక్షలుగా ఉంటుందని తెలిపింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలేనని తేలింది. 
 
ప్రమాదకరమైన టీబీ, కేన్సర్ ‌కంటే ఆత్మహత్యల వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని ఎన్.సి.ఆర్.బి. తెలిపింది. అయితే, అన్ని రంగాల్లో బాగా వెనుకబడిన రాష్ట్రంగా పేరొందిన బిహార్ రాష్ట్రంలో మాత్రం అతి తక్కువ సంఖ్య అంటే 0.70 శాతం మంది బలవన్మరణాలకు పాల్పడినట్టు ఎన్సీఆర్బీ పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు