బీజేపీ కలిసి నడవడం విషం తాగినట్టుగా ఉన్నది : మెహబూబా ముఫ్తీ

ఆదివారం, 29 జులై 2018 (12:04 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పీడీపీ - బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెల్సిందే. దీనిపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లుగానే ఉండేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.
 
వాస్తవానికి బీజేపీతో పొత్తును తాను ముందే వ్యతిరేకించానని, కానీ.. తన తండ్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ తన మాటను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణానంతరం తప్పనిసరి పరిస్థితుల్లో తాను దానిని కొనసాగించాల్సి వచ్చిందన్నారు. 
 
పీడీపీతో పొత్తును బీజేపీ గత జూన్‌లో తెగదెంపులు చేసుకోవడంతో అధికారాన్ని కోల్పోయిన మెహబూబా.. శనివారం పీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడారు. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన రెండేళ్లలోనూ జమ్మూకాశ్మీర్‌కు ఉన్న 370 ఆర్టికల్‌ జోలికి ఆ పార్టీ రాకుండా అడ్డుకోగలిగానని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు