ఆసియా కప్ టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. తటస్థ వేదిక అయిన దుబాయ్ కేంద్రంగా సెప్టెంబరు 15వ తేదీ నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
ఈ టోర్నీ షెడ్యూల్ తాజాగా విడుదల చేయగా, గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్థాన్‌తోపాటు ఓ క్వాలిఫయర్ జట్టు.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో 18న క్వాలిఫయర్‌తో ఆడుతుంది.
ఆ మరుసటి రోజు జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను టీమిండియా ఢీకొంటుంది. గ్రూప్ దశలో రెండు జట్ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 28న ఫైనల్ జరుగుతుంది. టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగే ఏకైక జట్టు చోటు కోసం యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేసియా, హాంకాంగ్ పోటీపడుతున్నాయి.