కృష్ణాష్టమి వేడుకలు.. పిల్లవాడికి కృష్ణుడి వేషం వేసిన ముస్లిం కుటుంబం (video)

సెల్వి

బుధవారం, 28 ఆగస్టు 2024 (12:49 IST)
Muslim family
దేశ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గోకులాష్టమిని పురస్కరించుకుని ప్రజలు ఉట్టి ఉత్సవాలు జరుపుకున్నారు. ఇంట కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఇంట వున్న చిన్నారులకు రాధాకృష్ణుల వేషాలు ధరించి కృష్ణుడిని తలచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కృష్ణాష్టమి వేడుకలు మతంతో సంబంధం లేకుండా జరుపుకున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
గతంలో ముస్లింలు కూడా కృష్ణాష్టమి వేడుకల్లో పాలు పంచుకున్న దాఖలాలు వున్నాయి. ముస్లిం మహిళలు తమ పిల్లలకు కృష్ణుడి వేషధారణతో అలంకరించి దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ముస్లిం కుటుంబం జన్మాష్టమికి తమ పిల్లవాడికి కృష్ణుడి వేషం వేసింది. 
 
ఆ వేషంతో రోడ్డుపై బైకులో వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతో ఇది భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు.

ఒక ముస్లిం కుటుంబం జన్మాష్టమికి తమ పిల్లవాడికి కృష్ణుడి వేషం వేసింది ???????? pic.twitter.com/FGecVXiLL6

— Syed Mahaboob Basha (@Smahaboob17) August 27, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు