ప్రఖ్యాత ఆర్థికవేత్త అభిజిత్ సేన్ ఇకలేరు... గుండెపోటుతో మృతి

మంగళవారం, 30 ఆగస్టు 2022 (11:14 IST)
ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు అభిజిత్ సేన్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 72 యేళ్లు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆ వెంటనే ఆయన్ను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే కన్నుమూసినట్టు ఆయన సోదరుడు ప్రణబ్ సేన్ వెల్లడించారు. 
 
కాగా, అభిజిత్ సేన్ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్‌గా పని చేశారు. కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ఛైర్మన్‌తో పాటు పలు కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. 
 
ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2014 వరకు అభిజిత్ సేన్ ప్రణాళికా సంఘం సభ్యుడిగా విశేష సేవలు అందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎంతో పట్టుకలిగిన అభిజిత్ సేన్ మృతిపట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు