230 కిమీ వేగంతో కారు నడిపి యమలోకానికెళ్లిన 'ఆ నలుగురు' ఫ్రెండ్స్

మంగళవారం, 18 అక్టోబరు 2022 (09:10 IST)
అమిత వేగం నలుగురి ప్రాణాలు తీసింది. స్నేహితులు చెప్పారని 230 వేగంతో కారు నడిపిన  ఓ వైద్యుడితో పాటు.. తనను ప్రోత్సహించిన మరో ముగ్గురు మృత్యుఒడిలోకి జారుకున్నారు. మృతులంతా బిహార్ వాసులు. 300 కిమీ వేగంతో కారు నడపాలన్న స్నేహితుల ప్రోత్సాహంతో రెచ్చిపోయిన డ్రైవర్ సీటులో ఉన్న డాక్టర్ 230 వేగంతో కారు నడిపి యమలోకానికి చేరుకున్నాడు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ఘోరం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నలుగురు స్నేహితుల్లో ఒకరు తనకు ఎంతో ఇష్టమైన బెంజ్ కారును కొనుగోలు చేశారు. ఈ నలుగురిలో ఒకరు బీహార్‌లోని వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆనంద్ ప్రకాశ్ (35), మరొకరు రియల్టర్ అఖిలేశ్ సింగ్ (35), ఇంకొకరు ఇంజినీర్ దీపక్ కుమార్ (37), మరొకరు వ్యాపారవేత్త భోలా కుశ్వాహ(37)లు మంచి స్నేహితులు. 
 
డాక్టర్ ఆనంద్ ప్రకాశ్ ఇటీవల సెకండ్ హ్యాండ్ బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశాడు. ఆ కారులో నలుగురూ కలిసి సోమవారం సుల్తాన్‌పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఆనంద్ కారును డ్రైవ్ చేస్తున్నాడు. బీఎండబ్ల్యూ కారు అవలీలగా 300 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని, ఇలా నెమ్మదిగా వెళ్లడం ఏమీ బాగోలేదంటూ ఓ మిత్రుడు ఆనంద్‌ను రెచ్చగొట్టాడు. 
 
పైగా, 300 కిలోమీటర్ల వేగంతో కారును నడపాలంటూ ప్రోత్సహించాడు. పైగా, కారు వేగాన్ని కూడా ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేశాడు. 'అంత వేగంతో వెళ్తే అందరం చస్తాం' అని ఆనంద్ అంటున్నప్పడటికీ మిగిలిన స్నేహితులు మాత్రం వద్దని చెప్పలేదు కదా మరింతగా ప్రోత్సహించాడు. అంతే.. ఒక్కసారిగా యాక్సలరేటర్‌ను నొక్కి పట్టాడు. కారు వేగం 230 కిలోమీటర్లు దాటింది. 
 
ఫేస్‌బుక్‌ లైవ్‌లో కొందరు వారి ప్రయాణాన్ని లైవ్‌లో వీక్షిస్తున్నారు. ఆనంద్ ఆ తర్వాత కారు వేగాన్ని తగ్గించాడు. గమనించిన మరో మిత్రుడు బ్రేకులెయ్యొద్దు. 'ఆరామ్ సే' అంటూ ప్రోత్సహించాడు. దీంతో కారు వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించుకున్న ఆనంద్.. అందరూ సీటు బెల్టులు పెట్టుకోవాలంటూ సూచించాడు. 
 
రహదారి తిన్నగా ఉన్న దగ్గర వేగం పెంచుతానని వారితో అంటుంటడగానే వంపులు లేని రహదారిలో కారు వేగాన్ని పెంచాడు. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత అంతే పెద్ద శబ్దం వచ్చింది. వేగంగా దూసుకెళ్లిన కారు కంటెయినర్‌ను ఢీకొట్టి నుజ్జనుజ్జు అయింది. కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 
 
కారు తుక్కుతుక్కుగా మారింది. ప్రమాదం తర్వాత కారు ఆకారం కనిపించనంతగా తుక్కు అయిదంటే అది ఎంత వేగంతో దూసుకెళ్లిందో ఊహించుకోవచ్చు. ఈ ఘటనకు ముందు జరిగిన వారి సంభాషణ మొత్తం ఫేస్‌బుక్‌ లైవ్‌లో రికార్డయింది. కంటైనర్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కారును కంటైనర్ లారీ వచ్చి ఢీకొట్టినట్టు సమాచారం. 

 

#TheNews | Watch: "Don't Brake," He Said As BMW Hit 230 kmph. All 4 Passengers Died https://t.co/IBOJQTYecG pic.twitter.com/djBoDi7Pe7

— NDTV (@ndtv) October 17, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు