ఈ దారుణానికి తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్, అతని భార్య లైలా తెగబడ్డారు. వీరికి మహ్మద్ షఫీ అనే మరో వ్యక్తి తన వంతు సహకారం అందించాడు. ఇందులోభాగంగా, షఫీ అనే వ్యక్తి కడవంతర, కాలడీలకు చెందిన ఇద్దరు మహిళలతో మహ్మద్ షఫీ సోషల్ మీడియాలో స్నేహం చేశాడు. సెప్టెంబరు 26వ తేదీన వారికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్ సింగ్ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు.
ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవనం సాగించే పద్మం (52), రోస్లీ(50)గా మృతులను గుర్తించారు. జీవితంలో ఆర్థిక కష్టాలు తొలగిపోవడంతోపాటు, సిరిసంపదలు కలుగుతాయన్న మూఢ నమ్మకంతోనే నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.