తమిళనాడు జాలర్ల వలలో రూ.50 కోట్ల విలువ చేసే అంబర్ గ్రీస్

సోమవారం, 3 అక్టోబరు 2022 (09:08 IST)
తమిళనాడు జాలర్లకు జాక్‌పాట్ తగిలింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొందరు జాలర్ల చేపల వలలో రూ.50 కోట్ల విలువ చేసే అంబర్ గ్రీస్ (తిమింగలం వాంతి) చిక్కంది. దీన్ని అచ్చెరపాక్కం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. 
 
అటవీ అధికారుల కథనం మేరకు... చెంగల్పట్టు జిల్లా కల్పాక్కం సమీప కడపాక్కం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్‌, మాయకృష్ణన్‌, కర్ణన్‌, శేఖర్‌ చేపల వేట కోసం శనివారం సముద్రంలోకి వెళ్లారు. 
 
వారు విసిరిన వలల్లో 38.6 కిలోల అంబర్‌ గ్రిస్‌ చిక్కింది. జాలర్లు ఈ విషయాన్ని అచ్చిరుపాక్కం అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. 
 
కాగా, ఈ అంబర్ గ్రీస్‌ను సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. ఫలితంగా మార్కెట్‌లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. తిమింగలాల కడుపులో తయారయ్యే ఈ పదార్థం వాంతి రూపంలో గడ్డగా బయటకు వస్తుంది. దీన్నే ఫ్లోటింగ్ గోల్డ్‌గా పిలుస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు