1951లో మొదటిసారిగా ఓటు వేసిన శ్యామ్, అప్పటి నుండి తన ఓటు హక్కును వినియోగించుకుంటూనే ఉన్నారు. రాబోయే ఎన్నికలలో కూడా తప్పకుండా ఓటు వేస్తానని చెబుతున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తానని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా కల్పా గ్రామానికి చెందిన శ్యామ్ శరణ్ 1951లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసారు.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయిన శ్యామ్ 1975లో పదవీ విరమణ పొందారు. అతనికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. మనవళ్లు, మనుమరాళ్లు కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా తన పని తానే చేసుకుంటాడని, కళ్లు కూడా బాగా కనిపిస్తాయని అతని కుమారులు చెబుతున్నారు.