ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బాబు మాట్లాడుతూ వచ్చే నెల ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తప్పకుండా టీడీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అయితే లోకేశ్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు.
టీడీపీ కార్యకర్త ఒకరు లోకేశ్ అన్నా ఎన్నికలు తొమ్మిదో కాదు, పదకొండు అని అనడంతో లోకేశ్ కవర్ చేసుకోలేక తర్జనభర్జన పడ్డారు. అయితే లోకేశ్ చేసిన ఈ తప్పుడు ప్రకటన పట్ల వైసీపీ, జనసేన నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో లోకేష్ వీడియోని పోస్ట్ చేసి సెటైర్లు మీద సెటైర్లు వేస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ట్విట్టర్‌లో కామెంట్‌లు చేసారు. లోకేశ్ చెప్పినట్లుగా ప్రజలంతా ఏప్రిల్ 9న టీడీపీకి ఓటు వేయాలన్నారు. అయితే ఏప్రిల్ 11న మాత్రం వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్‌కు ఓటేసి గెలిపించాలని వ్యంగ్యంగా ట్వీట్ చేసారు.