పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

ఠాగూర్

శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (10:48 IST)
కాశ్మీర్ లోయలోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం నేర్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా, పాకిస్థాన్‌పై దౌత్యయుద్ధం ప్రకటించింది. సరిహద్దులను మూసివేసింది. సింధూ జలాల ఒప్పందం, ఇరు దేశాల సరిహద్దుల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే పాకిస్థాన్‌కు జై కొట్టారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై దేశద్రోహం కేసు పెట్టినట్టు ఆ రాష్ట్ర బీజేపీ పాలిత ముఖ్యమంత్రి హిమంత వెల్లడించారు. మరోవైపు, అమినుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఏఐయూడీఎఫ్ ప్రకటించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా అమినుల్ వ్యక్తిగతమని తెలిపింది. ఉగ్రదాడిపై పాకిస్థాన్‌కు ఏ విధంగ మద్దతు పలికినా వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హిమంత హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు