కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

ఠాగూర్

గురువారం, 20 మార్చి 2025 (19:44 IST)
ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధి ఆగ్రహంతో ఊగిపోయాడు. కాంట్రాక్టు ఉద్యోగిపై చేయిచేయుకున్నాడు. చెంప ఛెళ్లుమనిపించాడు. అరటి బోదెతో తలపై కొట్టాడు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
బిలాస్‌పూర్‌లో స్థానిక ఎమ్మెల్యే షంసుల్ హుడా దైఖోవా మార్కెట్‌లో కొత్తగా నిర్మించిన ఆర్సీసీ వంతెన నిర్మాణం కోసం వచ్చారు. ఆయన కాంట్రాక్టర్ ఉద్యోగి సాహిదుర్ రెహ్మాన్‍‌పై దాడికి తెగబడ్డాడు. శంకుస్థాపన కోసం కట్టిన రిబ్బన్ ఎరుపు రంగుకు బదులు గులాబీ రంగు రిబ్బన్ ఉంచాడు. 
 
ఈ రిబ్బన్ చూడగానే ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయాడు. దీనిని చూసిన నెటిజన్లు ఎమ్మెల్యే అహంకారం, అధికార దుర్వినియోగానికి నిదర్శనమని సాహిదుర్ వ్యాఖ్యానించాడు. 
 

ఉద్యోగిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఎమ్మెల్యే

అస్సాం బిలాస్‌పూర్లో స్థానిక ఎమ్మెల్యే షంసుల్ హుడా రెచ్చిపోయాడు. దైఖోవా మార్కెట్‌లో ఆర్‌సిసి వంతెన శంకుస్థాపన కార్యక్రమంలో షంసుల్ హుడా, కాంట్రాక్టర్ ఉద్యోగి సాహిదుర్ రెహమాన్‌పై తీవ్రంగా దాడి చేశాడు. అతను ఎరుపు రంగుకు బదులుగా గులాబీ… pic.twitter.com/O7Ppm1Q7vt

— ChotaNews App (@ChotaNewsApp) March 20, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు