పంజాబ్ రాష్ట్రంలోని బతిండాలోని పలు ప్రాంతాల్లో వెలసిన పోస్టర్లను చూసిన అనేక మంది అమ్మాయిలు, వారి తల్లితండ్రులు షాక్‌కు గురయ్యారు. బతిండాలో నిర్వహించే అందాల పోటీల్లో విజేతగా నిలిచేవారికి ఎన్నారై వరుడిని బహుమతిగా ఇస్తామని ఆ వాల్‌పోస్టర్లలో ప్రకటించారు. వీటిని చూసిన వారు నోరెళ్లబెట్టారు. దీంతో ఈ అందాలపోటీల నిర్వాహకులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
కానీ, విషయం తెలిసిన పోలీసులు ఈ నెల 23వ తేదీన అందాల పోటీలను నిర్వహించాలని చూస్తున్న నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అందాల పోటీ విషయమై రూపొందించిన పోస్టర్లలో మహిళల గురించి అసభ్యకరమైన పదాలు రాసి ఉన్నట్టు గుర్తించామన్నారు. అందుకే కేసు నమోదు చేశామని వారు వివరించారు.
అయితే, అందాల పోటీ ప్రకటన చూసి నెటిజన్లు షాకయ్యారు. ఇదేం బహుమతి అంటూ నోరెళ్లబెట్టారు. అయితే, ఇందులో తప్పేముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తంమీద ఈ పోస్టర్లు బతిండాలో సంచలనం సృష్టించాయి.