మత్స్యకారుడి పంట పండింది.. వేలంలో రూ.13 లక్షలు పలికింది..

శుక్రవారం, 1 జులై 2022 (11:17 IST)
Fish
పశ్చిమ బెంగాల్‌‌లో కూడా ఓ మత్స్యకారుడి పంట పండింది. తన వలలో పడిన చేప భారీ రేటుకు అమ్ముడుపోయింది. ఏకంగా లక్షల పలకడంతో అతడి కష్టాలన్నీ తీరిపోయాయి. ఈస్ట్ మిడ్నాపూర్‌కు చెందిన ఓ జాలరి అందరిలాగే సముద్రంలోకి వేటకు వెళ్లాడు. 
 
ఐతే అతడి వలకు తెలియా భోలా జాతికి చెందిన భారీ చేప చిక్కింది. దాని బరువు ఏకంగా 50 కేజీలు ఉంది. అంత పెద్ద చేప చిక్కడంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధుల్లేవు. అందులోనూ అది 'తెలియా భోలా' చేప కావడంతో.. పండగ చేసుకున్నాడు.
 
50 కేజీల ఆ భారీ చేపను తూర్పు భారతదేశంలో అతి పెద్ద చేపల వేలం కేంద్రమైన దిఘా మోహన ఫిష్ ఆక్షన్ సెంటర్‌లో వేలం వేశారు. 
 
చివరకు దక్షిణ 24 పరగణాల జిల్లా నైనాన్ ప్రాంతానికి చెందిన శివాజీ కబీర్.. భారీ రేటు పెట్టి.. దానిని దక్కించుకున్నాడు. కిలోకు రూ.26వేల చొప్పున..13 లక్షలు చెల్లించి.. కొనుగోలు చేశాడు. వాస్తవానికి ఆ చేప బరువు 55 కేజీలు ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు