పిజ్జా సెంటర్ యువతిపై బూతులు తిడుతూ మేనేజర్ దాడి

బుధవారం, 4 ఆగస్టు 2021 (10:09 IST)
పని చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి మీద కామాంధుడైన మేనేజర్ కన్నుపడింది. అమ్మాయిని అనేక రకాలుగా హింసిస్తున్న ఆ మేనేజర్ తనను ప్రేమించాలని, లేదంటే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తానని వేధించాడు. కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడం, కరోనా వైరస్ దెబ్బతో వేరే చోట ఉద్యోగం చిక్కడం కష్టంగా మారడంతో కచ్చితంగా ఆ అమ్మాయి అక్కడ ఉద్యోగం చెయ్యాల్సి ఉంది. ఇదే అదనుగా బావించిన మేనేజర్ ఆమెను మరింత టార్చర్ పెట్టాడు. అలా ఓసారి మేనేజర్ బలంగా కొట్టడంతో ఆ అమ్మాయి ఎగిరి పక్కకు పడిపోయింది. 
 
మేనేజర్ దాడి చెయ్యడం, ఆ అమ్మాయి కిందపడిపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది హడలిపోయారు. అమ్మాయి మీద మేనేజర్ దాడి చేస్తున్న సమయంలో అదే పిజ్జా సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ క్లిప్పింగ్స్ బయటకు రావడంతో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ మేనేజర్ పరారైనాడు. ఇదంతా బెంగళూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని బసవనగుడిలోని రామక్రిష్ణ ఆశ్రమం రోడ్డులో డోమినోస్ పిజ్జా సెంటర్ ఉంది. ఈ డోమినోస్ పిజ్జా సెంటర్‌లో పురుషోత్తమ్ అనే వ్యక్తి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రామక్రిష్ణ ఆశ్రమం రోడ్డులోని డోమినోస్ పిజ్జా బ్రాంచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. డోమినోస్ పిజ్జా బ్రాంచ్‌లో పని చేస్తున్న యువతి మీద కామాంధుడైన మేనేజర్ పురుషోత్తమ్ కన్నుపడింది. 
 
అమ్మాయిని అనేక రకాలుగా హింసిస్తున్న మేనేజర్ పురుషోత్తమ్ తనను ప్రేమించాలని, లేదంటే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తానని టార్చర్ పెట్టాడు. కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడం, కరోనా వైరస్ కారణంగా వేరే చోట ఉద్యోగం చిక్కదు అనే భయంతో ఆమె కచ్చితంగా ఆ అమ్మాయి అక్కడ ఉద్యోగం చెయ్యాల్సి వచ్చింది. ఇదే సమయంలో మేనేజర్ పురుషోత్తమ్ కు ఓ విషయం తెలిసింది. 
 
తనను ప్రేమించడానికి నిరాకరిస్తున్న యువతి వేరే యువకుడితో తిరుగుతోందని మేనేజర్ పురుషోత్తమ్‌కు తెలిసింది. ఈ విషయంపై పురుషోత్తమ్ అమ్మాయితో గొడవపెట్టుకున్నాడు. పని సక్రమంగా చెయ్యడంలేదని సాటి ఉద్యోగుల ముందు ఆ అమ్మాయిని బూతులు తిడుతున్న సమయంలో ఆ మేనేజర్ పురుషోత్తమ్ ఒక్కసారిగా ఆమె ముఖం మీద దాడి చేశాడు. మేనేజర్ పురుషోత్తమ్ బలంగా కొట్టడంతో ఆ అమ్మాయి ఎగిరి పక్కకు పడిపోయింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో వున్న మేనేజర్ కోసం గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు