నమ్మ యాత్రి ఆటో ఇష్యూ.. ఆటోను నా భార్య హొరమావు నుండి బెంగుళూరులోని తనిసంద్రకు బుక్ చేసింది. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఆమెను హెబ్బాల్ సమీపంలోని రాంగ్ రూటుకు తీసుకెళ్లాడు. ఆపమని పదే పదే చెప్పినా వినలేదు. దీంతో కదులుతున్న ఆటోలోంచి దూకాల్సి వచ్చింది అని ఆమె భర్త శుక్రవారం ఎక్స్‌లో బాధితురాలి భర్తు పోస్ట్ చేశాడు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి నమ్మ యాత్రిలో కస్టమర్ కేర్ నంబర్ లేదని ఆయన ఫిర్యాదు చేశాడు.
ఇక ఈ ఫిర్యాదుపై స్పందించిన నమ్మ యాత్రి, "హాయ్ అజర్, మీ భార్యకు కలిగిన అసౌకర్యం గురించి విన్నందుకు మేము చింతిస్తున్నాము, ఆమె ఇప్పుడు బాగానే ఉందని మేము ఆశిస్తున్నాము. దయచేసి మాకు రైడ్ వివరాలను డీఎం చేయండి. మేము దీన్ని వెంటనే పరిష్కరిస్తాము" అని హామీ ఇచ్చింది.