దక్షిణాది పై బీజేపీ దృష్టి

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (10:23 IST)
త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లో వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలయింది.

అన్నింట్లో, వెస్ట్ బెంగాల్ లో కాస్త ముందుగానే కసరత్తులు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరంలో బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ మొదలైన చోట్ల జరిగిన ఎన్నికల్లో బిజెపి మంచి ఫలితాలు రాబట్టుకుంది.
 
మహారాష్ట్రలో ఎదురుదెబ్బతిన్నా, బీహార్ లో సాధించిన గెలుపు బిజెపికి మంచి ఊతాన్ని ఇచ్చింది. తెలంగాణ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లోనూ గణనీయమైన ఫలితాలు రాబట్టుకుంది.

ఈ  విజయాల పరంపరతో బిజెపి మంచి ఊపులో ఉంది. అస్సాం, వెస్ట్ బెంగాల్ లో ముఖ్యమంత్రి స్థానాలను కైవసం చేసుకుంటామని, తమిళనాడులో కింగ్ మేకర్ గా చక్రం తిప్పుతామనే విశ్వాసాన్ని బిజెపి నేతలు వ్యక్తం చేస్తున్నారు.

కేరళలో గతంలో ఎటువంటి ఉనికిలో లేని బిజెపికి, గడచిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం కాస్త పెరగడం ఊరటనిచ్చే అంశం. ఎన్నికలు జరుగబోయే 5 రాష్ట్రాల్లో 3రాష్ట్రాలు దక్షిణాదిలోనే ఉన్నాయి.దక్షిణాదిలో విజృంభించి అధికారం కైవసం చేసుకోవాలనే ఆరాటంలో ఉన్న బిజెపి ఆట మొదలెట్టింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు