బీజేపి సంచలన నిర్ణయం: తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యే భజన్ లాల్‌కి సీఎం పదవి

మంగళవారం, 12 డిశెంబరు 2023 (17:04 IST)
భారతీయ జనతా పార్టీ రాజస్థాన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది. సిఎం పదవికి భజన్ లాల్ శర్మ పేరును ఆమోదించింది. వసుంధర రాజే సీఎం పదవికి భజన్‌లాల్ శర్మ పేరును ప్రతిపాదించారు. దీనికి ఎమ్మెల్యేలందరూ అంగీకరించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్‌లో కూడా చర్చకు రాని వ్యక్తిని బీజేపీ ముందుకు తెచ్చింది. శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి రాజ్‌నాథ్‌సింగ్‌కు పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత మాజీ సీఎం వసుంధర రాజే చేతికి స్లిప్ ఇచ్చారు. ఈ స్లిప్‌లో రాష్ట్రానికి కాబోయే సీఎం పేరు ఉంది. వసుంధర రాజే మీడియా ముందుకు వచ్చి భజన్‌లాల్ శర్మ పేరును ప్రకటించారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎంలుగా అనితా భడాలే, కైలాష్ చౌదరి ఎంపికయ్యారు.
 
దీనికి ముందు కేంద్ర పరిశీలకుడు రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం మధ్యాహ్నం జైపూర్ చేరుకున్నారు. రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు సహ పరిశీలకులు వినోద్ తావ్డే, సరోజ్ పాండే కూడా జైపూర్ వచ్చారు. రాజస్థాన్‌లో బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఆయనతో పాటు విమానంలో వచ్చారు. జైపూర్ విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సీపీ జోషి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్వాగతం పలికారు.
 
పార్టీ కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం కాగానే, ఢిల్లీ నుంచి వచ్చిన పరిశీలకులు, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తావ్డే, సరోజ్ పాండే, ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రహ్లాద్ జోషి పలువురు బీజేపీ నేతలను వేర్వేరు గదుల్లో కలిశారు. ఎట్టకేలకు భజన్ లాల్ పేరును ప్రతిపాదించడంతో ఆయన ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు