పవన్ కళ్యాణ్‌ను అంత మాట అన్నానా? ఎపుడు.. ఎక్కడ? కిషన్ రెడ్డి వివరణ

సోమవారం, 11 డిశెంబరు 2023 (10:20 IST)
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఓటమికి సినీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీయేనని తాను విమర్శించినట్టు మీడియాలో వస్తున్న వార్తలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని నష్టపోయామని, ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జనసేనతో పొత్తు లేకుంటే మరో నాలుగు సీట్లు గెలుచుకునివుండేవాళ్లమంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారని విస్తృతంగా ప్రచారం సాగుతుంది. 
 
దీనివి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు అనేది ఒకరిద్దరు తీసుకున్న నిర్ణయం కాదన్నారు. ఇరు పార్టీలు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయమన్నారు. ఇలాంటి వార్తలను నమ్మొద్దని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 
 
కాగా, ముగిసిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది. అలాగే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అధికార భారత రాష్ట్ర సమితి (భారాస) 39 సీట్లతో సరిపెట్టుకుని అధికారానికి దూరమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు