ప్రభుత్వానికి కూలగొట్టేందుకు రూ.100 కోట్ల ఆఫర్ : సీఎం సిద్ధరామయ్య

ఠాగూర్

శనివారం, 31 ఆగస్టు 2024 (16:14 IST)
ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేస్తోందని వ్యాఖ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బుకు ఆశపడబోరని విశ్వాసం వ్యక్తం చేసిన సిద్ధరామయ్య
 
తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నిందని, ఇందులోభాగంగా, తమ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లను ఆఫర్ చేసిందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. అయితే, తమ పార్టీ ఎమ్మెల్యేలు డబ్బుకు లొంగే రకం కాదని ఆయన  పేర్కొన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేస్తోందంటూ మా ఎమ్మెల్యే రవికుమార్ గౌడ్ నాకు చెప్పారు. 'ఆపరేషన్ లోటస్' ద్వారా మాత్రమే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఇచ్చిన తీర్పుతో వారు ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. 2008, 2019లో 'ఆపరేషన్ కమలం', దొంగచాటు మార్గం ద్వారా అధికారంలోకి వచ్చారు' అని సీఎం సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు
 
కాంగ్రెస్ పార్టీకి 136 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, తమ ప్రభుత్వాన్ని పడగొట్టడం అంత తేలిక కాదని సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి రాజీనామా చేయాల్సి ఉంటుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవ్వరూ డబ్బుకు ఆశపడేవారు లేరని, ఈ మేరకు తనకు విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు