ఈ నేపథ్యంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో దినకరన్ గెలిచి డీఎంకే నేత స్టాలిన్‌కు గుణపాఠం చెబుతారన్నారు. దినకరన్‌కు, డీఎంకేకు అధికార పార్టీ అసలు పోటీనే కాదని చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం రాష్ట్రానికి ఎటువంటి మంచి పనులు చేయలేదని, వారిద్దరూ అసమర్థులని అన్నారు. డీఎంకే పార్టీ హిట్లర్ పార్టీ అని, దాని నుంచి దినకరన్ మాత్రమే ప్రజలను కాపాడగలడని అన్నారు.
కాగా, ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఈ.మధుసూదనన్ పోటీ చేస్తుండగా, డీఎంకే తరపున మరుద గణేష్, స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్‌తో పాటు.. మరికొంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్న విషయం తెల్సందే.