దేశీయంగా ఈ డ్రగ్ ఉత్పత్తి పెంచడంతో పాటు, దిగుమతులు చేసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కొనేందుకు వైద్యులు 'ఆంఫోటెరిసిన్-బీ' అనే మందును సూచిస్తుండటంతో మార్కెట్లో ఈ డ్రగ్ కొరత ఏర్పడకుండా ముందు నుంచీ చర్యలు ముమ్మరం చేస్తున్నది. ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీకి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది.
ఇలా ఉండగా, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకుతుండటం ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే.