నవమాసాలు మోసి.. కంటికి రెప్పలా కాపాడిన తల్లికి తన బిడ్డ ప్రమాదంలో వుండటం సహించలేకపోయింది. ఇంకా ఎదురుదాడికి దిగి తన బిడ్డను కాపాడుతుంది. తన ప్రాణాలకంటే తన బిడ్డను ప్రాణాలే ఆ తల్లి కాపాడాలని అనుకుంది. చివరకు ఆ ప్రమాదమే ఆతల్లి దాడికి తట్టుకోలేక వెనుతిరిగింది. ఆ ప్రమాదమే పులి. పులి తన బిడ్డను తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అది గమనించిన ఆ తల్లి ఆ పులితో పోరాడింది.
వివరాల్లోకి వెళితే.. రోహ్నియా గ్రామానికి చెందిన భోలా ప్రసాద్, అర్చన దంపతులకు 15 నెలల కుమారుడు ఉన్నాడు. తన బిడ్డ రవిరాజును తీసుకుని కాలకృత్యాలకై పొలానికి తీసుకెళ్లింది అర్చన. అక్కడికి ఇంతలో వచ్చిన పులి, వారిపై దాడి చేసింది, బాలుడిని నోట్లో కరచుకుని వెళ్లబోయింది.
దీంతో.. ఆ చిన్నారిని కాపాడే సమయంలో పులి అర్చననూ గాయపరిచింది. అయినా అర్చన అవేవీ లెక్కచేయకుండా గట్టిగా అరుస్తూ పులిని అడ్డుకుంది. దీంతో అర్చన కేకలు విని కొంత మంది గ్రామస్థులు అక్కడికి చేరుకుని పులిని చెదరగొట్టారు. అయితే.. గాయపడిన తల్లీ, కుమారుడిని వెంటనే మన్పుర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.