ప్రేమోన్మాది నవవధువు గొంతుకోశాడు. తనను ప్రేమించలేదనే కోపంతో పాటు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో గొంతుకోశాడు. ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ టౌన్ షిప్‌కు చెందిన 26 ఏళ్ళ యువతికి ఈ నెల 4వ, తేదిన సోనేపట్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది.