వరకట్నం.. బైక్ వద్దన్నాడు.. బుల్లెట్ కావాలన్నాడు.. వరుడిని చితకబాదిన..?

శనివారం, 22 మే 2021 (14:28 IST)
వరకట్నం కింద బైక్ వద్దని బుల్లెట్ కావాలని ఓ పెళ్లి కొడుకు డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థాలు చితకబాదారు. చివరకు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అమేథీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. అమేథీ గ్రామానికి చెందిన నాసిమ్ అహ్మద్ కుటుంబం నివాసం ఉంటోంది. మొహమ్మద్ అమీర్ కుమారుడు ఇమ్రాన్ సాజ్ తో నాసిమ్ కుమార్తెకు వివాహం నిశ్చయమైంది.
 
వివాహం జరిగిన అనంతరం విందులో వరుడు మనస్సులో ఉన్న కోరికను వెలిబుచ్చాడు. వరకట్నం కింద తనకు ఇచ్చిన బైక్ వద్దని, బుల్లెట్ వాహనం ఇవ్వాలని పట్టుబట్టాడు. అంత స్థోమత తనకు లేదని, త్వరలోనే బుల్లెట్, కారు ఇస్తానని వధువు తండ్రి చెప్పాడు.
 
ఎంత బతిమిలాడినా అతను వినిపించుకోలేదు. ఆగ్రహించిన గ్రామస్థులు చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని.. ఇరు కుటుంబాల పెద్దలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యాయి. దీంతో కేసు నమోదు చేసుకుని తండ్రి, వరుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు