బస్సు హైజాక్ కేసు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలకు ఆదేశం

బుధవారం, 19 ఆగస్టు 2020 (23:02 IST)
బుధవారం ఉదయం ఆగ్రాలో జరిగిన బస్ హైజాక్ సంఘటనపై  ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివేదిక కోరారు. అదనపు చీఫ్ సెక్రట్రీ(హోం)అవనీష్ అవస్థీ విలేకరుతో మాట్లాడుతూ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆగ్రాలోని జిల్లా మెజిస్ట్రేట్, సీనియర్ పోలీసు సూపరిండెంట్ (ఎస్ఎస్ పి)ను ఆదేశించారు.
 
ప్రయాణికులందరు సురక్షితంగా ఉన్నారని వారు తమ గమ్య స్థానాలకు వెళ్లిన ఝాన్సీ వద్ద దింపి వేయబడ్డారని తెలిపారు. బస్సును తీసుకెళ్లిన శ్రీరామ్ పైనాన్స్ కంపెనీ చర్యను ఎదుర్కోవలసి ఉంటుందని యూపీ మంత్రి ప్రతినిధి సిద్దార్థ్ నాథ్ సింగ్ అన్నారు. బుధవారం ఉదయం ఠానా మాల్పుర వద్ద డ్రైవర్ మరియు కండక్టర్ బస్సు దిగడంతో పైనాన్స్ కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగులు బస్సు మరియు ప్రయాణికులతో బయలుదేరారు.
 
బస్సు కండక్టర్ రాం విశాల్ పటేల్ విలేకరులతో మాట్లాడుతూ బస్సు యజమాని ఎనిమిది వాయిదాలు చెల్లించలేదని అందవల్ల వారు బస్సును తీసుకెళ్లారని పైనాన్స్ సంస్థకు తమకు తెలిపారని చెప్పారు. యాదృచ్చికంగా బస్సు యజమాని మంగళవారం మరణించారు. అతని కుమారుడు బుధవారం బస్సు హైజాక్ జరిగినపుడు దహన సంస్కారాలలో బిజీగా ఉన్నాడనీ తెలిపారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు