అయితే ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆ ముగ్గురు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. ఇక బెయిల్ విచారణ సందర్భంగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిందితులపై తప్పుడు కేసు పెట్టినట్లు సదరు మహిళ అంగీకరించడంతో కథ రివర్స్ తిరిగింది. కోల్‌కతా కోర్టు తల్లీకూతుళ్లపై విచారణ జరపాలని ఆదేశించింది. ఆ తల్లీకూతుళ్లపై విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
ఇది విన్న ధర్మాసనం.. ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు నిందితులకు తక్షణ బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఆ ముగ్గురిపై కేసును కొట్టేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అమాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఆర్థికంగా ఎదగడం సాధ్యమా అని కోర్టు ప్రశ్నించింది. ఇంకా తప్పుడు కేసు పెట్టి కల్పిత సాక్ష్యాలు అందించిన మహిళలపై విచారణ జరిపించాలని ట్రయల్ కోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.